Sunday, December 31, 2006

కపిరాజు!

కపిరాజు!

కలల మకుటం ధరించా
కవిత కై నే తపించా

అంగారం రగిలినట్టు
ఆవేశం కలిగితే
మంజీరం కదలినట్టు
నా హృదయం మ్రోగితే
మందారం పూసినట్టు
మనసేమో విరిస్తే

రేసు బళ్ళ స్పీడు లో అక్షరాలు కదిలినపుడు
కవితకై నే తపించా
కవిత్వం లోనే తరించా
కవిత్వం లో...నే తరించా
కవిరాజునని గర్వించా!

***
ఇంతలోనే మురిసినంత లోనే
అయ్యింది నాకు వివాహం...
నా ఉద్యోగంతో, సంసారం తో!

ఆవేశమంతా సిగరెట్టు పొగ లా
కిక్కిస్తూనే చెప్పు కింద అణిగిపోతోంది!
ఆలోచనంతా గొలుసు లేని బందీ లా
చిక్కిపోతూ క్యూబులోనే ఒణికిపోతోంది!

చర్చలూ, సంవాదాలూ, దేశ సమస్యలూ
ఒకప్పటి బాధలు!
H1 లూ, GC లూ,ప్రొమోషన్ లూ, 401k లూ
ఇకిప్పటి గాధలు!

అటు ఇటూ కాని సందిగ్ధం లో
సూర్యుడి చుట్టూ తిరిగేస్తూ
అందమైన అబద్ధపు గారడీలో
గెంతుతున్న కపిరాజునని గ్రహించా!

12-31-06
యోగానంద్

G.C: Green Card, 401K: ఇండియా లో PF లాంటిది.