Friday, March 02, 2007

దగ్గు

దగ్గుతున్నాడు రోగి
అసలు ఆపుకోలేకుండా-
మెల్లగా క్షిణించుకు పోతున్నాడు,
గుండెల్లో మండుతున్న
కల్మషమంతాబైటికొచ్చేస్తోంది,
తేలిగ్గా ఉంటోంది-
అలానే క్షిణించి పోతున్నాడు
అసలాపుకోలేకుండా దగ్గుతున్నాడు...

ఈ చావు బతుకుల కొట్లాట లో
ప్రతి దగ్గు తరవాత
మరో జన్మెత్తినట్టు
ఆనంద పడిపోతున్నాడు!

3-02-07
యోగానంద్
PS:- అసలు నిద్ర కూడా పట్టలేనంతగా దగ్గుతున్నాను ఇప్పుడు :-( (ఇది రాసిన సమయం లో)

3 comments:

Anonymous said...

baavundanDi. ee kavitaa baagundi. ee blaagoo baagundi.

Yoga said...

Thanks Sowmya...

Subrahmanyam Mula said...

Yoga, Please execuse me for taking liberty in editing your poem. just think in these lines. u need not change ur poem. just for guideline i edited it. i liked the idea of the poem.

క్షీణించుకుపోతున్నా
ఆపుకోలేనంత దగ్గు

గుండెల్లోని
మంటంతా
బైటకొచ్చేసి

తేలిగ్గా..

చావు బతుకుల కొట్లాటలో
ప్రతి దగ్గు తర్వాత
మరో జన్మే!