పాడవా...
ఒక్క పాట!
ఒంటరి తనాన్ని
తనివి తీరా తాగుతున్న
నా మనసుని ఆహ్లాద పరుస్తూ
పాడవా...
ఒక్క పాట!
లిప్స్టిక్ ఎరుపుని
కసిగా జుర్రుకుంటున్న
ఈ గాజు గ్లాసు నుంచి
రాగాలూరుస్తూ
పాడవా...
ఒక్క పాట!
చుక్కలు నింపుకున్న
ఈ యామినిలో
విరిగిన మనసులతో
విసిగిన మనుషుల
పార్టీల ప్రేలాపనల్లో
ఆనందం శఠిన్చే వేళ-
ఆ చరమ గీతానికి
పల్లవి కూరుస్తూ
పాడవా...
ఒక్క పాట!
05/18/2011
యోగా