Wednesday, February 28, 2007

Haiku-9

వీచే గాలి తో
మమేకమవుతూ
చెట్టుకొమ్మలు...

2-28-07
యోగానంద్

ఓ టీ తాగుతున్న సమయం లో...

కథ లోని పాత్ర
బాలేదని
పాఠకుడి ఏడుపు

రోడ్డు మీద రాయి
తగిలిందని
పథికుడి ఏడుపు

***

తన చేతిలో కప్పు
ఖాళీ చేసి
పిపాసి మౌనంగా నవ్వు...

2-28-07
యోగానంద్

Thursday, February 22, 2007

Haiku-8

పోతున్న సూరీడు,
సముద్రం లో దారి-
వలసపోతున్న పక్షులు...

2-25-07
యోగానంద్

PS: ముందు రాసిన హైకూ సవరించ మని చెప్పిన స్నేహితుడు సుబ్బు (మూలా సుబ్రహ్మణ్యం) కి ధన్యవాదాలతో!


Wednesday, February 21, 2007

Waterfall (Photography)


My Buddy Raghuveer's Photography....
He allowed me to use this as my blog display pic.

Feel free to visit his link at:

http://www.photo.net/photos/Raghuveer Makala

Saturday, February 17, 2007

Haiku-7

మబ్బులన్నీ పోయాయి
ఆకాశం-
నిర్మలంగా...

2-17-07
యోగానంద్

Haiku-6

వాన చినుకులు-
అద్దం మీద జారుతూ
ఏవేవో బొమ్మలేస్తున్నాయి

2-17-07
యోగానంద్

Thursday, February 15, 2007

Haiku-5

తెల్లారుతూనే 880 మీద పరుగు...
ప్రశాంతంగా సినీవాలి...
అందరి కళ్ళ కిందా నిదురిస్తూ!

2-15-07
యోగానంద్

PS: 880 అంటే Interstate Highway 880, అని SF Bay Area లో San Jose ని Sanfrancisco కి కలిపే ఒక Highway(Freeway). ఈ కళ్ళ కింద సినీవాలి పద చిత్రం ఝుంపా లాహిరి తన కథల సంపుటి (Interpreter of Maladies) లో ఒక కథ లో చెప్పింది. ఆ పద చిత్రాన్నే ఇక్కడ నేను వాడాను.

Haiku-4

అంతం లేని రోడ్డది-
పొడుగునా "రెడ్ లైట్లు"...
అందరూ ఆగి, ఏగిపోతున్నారు.

2-15-07
యోగానంద్

Sunday, February 11, 2007

Haiku-3

లైబ్రరీ నిశ్శబ్దం లో
పుటల చప్పుడు-
ఒక దాని తరవాత ఒకటి...

2-11-07
యోగానంద్

ఆమె

నిండు పున్నమి వేళ
పండు వెన్నెల అలిగిందట!
చంద్రుడు "తన అందం" తో, గర్వం తో
ఇంకెవరి మీదో మనసుపడి
అంబరమంతా చెలరేగిపోతున్నాడట!

అసూయతో రగిలిపోతున్న
వెన్నెల-
ఆమెను కప్పేసిందట, కమ్మేసిందట!

అమాయకురాలు!
వెన్నెల్లేని వన్నె లాడి తో-

వన్నె లేని సంగమం లో-
దివి లాభం లేదని
భువి కేగాయట,
ఆమె కన్నుల్లోనే ఉండిపోదామని
తరలొచ్చేసాయట తారలు!

ఉన్న ఆ ఒంటరి మేఘం
పన్నీరై కురిసిపోయిందట,
ఆమెను తడిపేసి మురిసిపోయిందట!

****

ఇలా మేనంతా వెన్నెలతో,
అలా కన్నుల్లో తారలతో,
పన్నీటి జల్లుల్లో తడిసి
ఉన్నాటి ఆమె కౌగిట్లో...
రసకేళి విన్యాసం లో-
నాకు తెలీలేదు...

ఆ వెన్నెల, తారలు, మేఘం
తమతో ఆకాశమంత శూన్యం కూడా తెచ్చాయని!

2-10-07

యోగానంద్

Thursday, February 08, 2007

పరుగు

ఎంతకని పారిపోతా
నంతరాత్మనుండి?
అలలు తా పుట్టిన
సంద్రం నుండి లా!

ఎందుకని పారిపోతున్నా
నందుకోలేదనుకుని?
అలెంత ముందుకేగినా
సంద్రం కలిపేసుకోదా అలా!

2-09-07
యోగానంద్

PS:- సూచనలిచ్చిన భూషన్ గారికి, స్నేహితుడు సుబ్బు (మూలా) కి కృతఙతలతో...

Haiku-2

హైకూ:

పరిగెత్తీ పరిగెత్తీ
అక్కడే అలసిపోయాడు
ట్రెడ్ మిల్ మీద...

2-09-07
యోగానంద్


స్నేహితుడు మూలా సుబ్రహ్మణ్యం సూచన మేరకు సవరించిన వెర్షన్ ఇదిగో:
ఎంత పరిగెట్టినా
అక్కడే...
ట్రెడ్మిల్ మీద!

సుబ్బూ, మరొక్కసారి ధన్యవాదాలు.

Wednesday, February 07, 2007

Haiku-1

ఇది నా మొట్టమొదటి హైకూ ప్రయోగం:

కరెంటు తీగల మీద
వేచివున్న పక్షులు,
అనంతమైన మైదానం లో కెగిరిపోడానికి...

2-07-07
యోగానంద్

PS: ఈ హైకూ, రచయిత మూలా సుబ్రహ్మణ్యం గారు రాసిన అద్భుతమైన వ్యాసాన్ని చదివాకా ప్రేరితుడనై రాసాను. అంతే కాక, ఆయనిచ్చిన సూచనలకి కృతఙుణ్ణి. ఆయన రాసిన వ్యాసం ఇక్కడ ఉంది: http://www.telugupeople.com/discussion/MultiPageArticle.asp?id=47645&page=1

చూడు సోదరా చూడు!

చూడు సోదరా చూడు!

చూడు సోదరా చూడు చూడు!
నేటి భారత "సెక్యులారిస్టు"!
మైనారిటికీ, మెజారిటీ కీ
మధ్య బతికే ఆర్సనిస్టు!

చూడు సోదరా చూడు చూడు!
నేటి తెలుగు వాణ్ణి చూడు!
తెలుగు పుట్టు కీ, ఆంగ్ల కట్టు కీ
మధ్య నలిగే తెలుగు రాని వాణ్ణి చూడు!
తెలుగు లేని వాణ్ణి చూడు!

చూడు సోదారా చూడు చూడు!
నేటి కమ్యూనిస్టు!
నక్సల్ మాటకీ, హింస బాటకీ
భక్తుడైన టెర్రరిస్టు!

చూడు సోదరా చూడు చూడు!
నేటి సమాజ "సేవకుడు"!
ఎవార్డులకీ, రివార్డులకీ
అమ్ముడుపోయిన పణ్యాత్ముడు!

చూడు సోదరా చూడు చూడు!
ఇవన్నీ రాసిన "కవి"ని చూడు!
బాస కదిపీ, ప్రాస కలిపీ
ఏదో "శ్రీశ్రీ" అనుకుంటాడు వాడు!

2-07-07
యోగానంద్

PS: శ్రీశ్రీ రాసిన ఒక వ్యంగ్య పద్యం చదివి ఇవన్నీ తట్టాయి. శ్రీశ్రీ ది ఏది చదివినా నాకు ఇంకో కవిత తడుతుంది. ఆక్షణం లో నేను మరో శ్రీశ్రీ అనట్టు గా ఫీలైపోవడమూ జరుగుతూ ఉంటుంది. సరే ఇంతకీ ఆ శ్రీశ్రీ వ్యంగ్య పద్యం ఇదిగో:

"అరె యార్, ఇధర్ ఆవో దేఖో!
ఆంధ్రుల దిన పత్రిక
పెట్టుబడికీ కట్టుకథకీ
పుట్టిన విష పుత్రిక"

సుజనరంజని ఫిబ్రవరి సంపుటి లో అద్దేపల్లి గారు రాసిన వ్యాసం లో మూడో పేజీ లోంచి తీసుకున్నా:
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani.html

Sunday, February 04, 2007

chitimaMTa

చితిమంట

ఆ అబద్ధపు నవ్వుల్ని కన్నా
అసంబద్ధ మాటల్నీ విన్నా...
గోడల్లేని గదిలో
ఊసల్లేని జైలు లో
బందీ వై చిక్కినపుడు
గమనిస్తూ...

అనుగమిస్తూనే ఉన్నా!

బాడిగానికి నన్నిచ్చి
ఊడిగానికి మేనిచ్చి
నల్ల కళ్ళ జోడుతో
కల్ల ముసుగు తొడుగుతో
నిత్యం మారే నీ రూపం
అద్దం లో చిక్కినపుడు
గమనిస్తూ...

అనుగమిస్తూనే ఉన్నా!

నీ శోష జీవనం లో
దిశ లేని పయనం లో
భీష్మించిన ఉరుములకీ,

గ్రీష్మించిన సుడిగాలికీ,
నాఘోష మూగవోయె
నా దశ ఆరిపోయె!

***

తుది పయనం చేరువవగ
నల్ల కళ్ళజోడు వదిలి
కల్ల ముసుగు తొడుగు వదిలి
నువ్వు నువ్వు గానున్నపుడు
నన్ను గుర్తించావా!
నీ మదిలోని దీపాన్ని
చితిమంటతో వెలిగించావా!
(నీ) చితిమంటతో వెలిగించావా!

2-05-07
యోగానంద్