నిండు పున్నమి వేళ
పండు వెన్నెల అలిగిందట!
చంద్రుడు "తన అందం" తో, గర్వం తో
ఇంకెవరి మీదో మనసుపడి
అంబరమంతా చెలరేగిపోతున్నాడట!
అసూయతో రగిలిపోతున్న
వెన్నెల-
ఆమెను కప్పేసిందట, కమ్మేసిందట!
అమాయకురాలు!
వెన్నెల్లేని వన్నె లాడి తో-
వన్నె లేని సంగమం లో-
దివి లాభం లేదని
భువి కేగాయట,
ఆమె కన్నుల్లోనే ఉండిపోదామని
తరలొచ్చేసాయట తారలు!
ఉన్న ఆ ఒంటరి మేఘం
పన్నీరై కురిసిపోయిందట,
ఆమెను తడిపేసి మురిసిపోయిందట!
****
ఇలా మేనంతా వెన్నెలతో,
అలా కన్నుల్లో తారలతో,
పన్నీటి జల్లుల్లో తడిసి
ఉన్నాటి ఆమె కౌగిట్లో...
రసకేళి విన్యాసం లో-
నాకు తెలీలేదు...
ఆ వెన్నెల, తారలు, మేఘం
తమతో ఆకాశమంత శూన్యం కూడా తెచ్చాయని!
2-10-07
యోగానంద్
5 comments:
poem is ok.
idi konchem edit chEstaa...taravaata...usual
usual gaa alaa minor eidts chestoo unTaa...
Hello Yoganand,
As the saying goes, "When it rains...it pours". These many all of a sudden.
I liked this one very much. Hiku are to be modified.
Wishing you to be more and more prolific.....
Thanks Adi
Post a Comment