చూడు సోదరా చూడు!
చూడు సోదరా చూడు చూడు!
నేటి భారత "సెక్యులారిస్టు"!
మైనారిటికీ, మెజారిటీ కీ
మధ్య బతికే ఆర్సనిస్టు!
చూడు సోదరా చూడు చూడు!
నేటి తెలుగు వాణ్ణి చూడు!
తెలుగు పుట్టు కీ, ఆంగ్ల కట్టు కీ
మధ్య నలిగే తెలుగు రాని వాణ్ణి చూడు!
తెలుగు లేని వాణ్ణి చూడు!
చూడు సోదారా చూడు చూడు!
నేటి కమ్యూనిస్టు!
నక్సల్ మాటకీ, హింస బాటకీ
భక్తుడైన టెర్రరిస్టు!
చూడు సోదరా చూడు చూడు!
నేటి సమాజ "సేవకుడు"!
ఎవార్డులకీ, రివార్డులకీ
అమ్ముడుపోయిన పణ్యాత్ముడు!
చూడు సోదరా చూడు చూడు!
ఇవన్నీ రాసిన "కవి"ని చూడు!
బాస కదిపీ, ప్రాస కలిపీ
ఏదో "శ్రీశ్రీ" అనుకుంటాడు వాడు!
2-07-07
యోగానంద్
PS: శ్రీశ్రీ రాసిన ఒక వ్యంగ్య పద్యం చదివి ఇవన్నీ తట్టాయి. శ్రీశ్రీ ది ఏది చదివినా నాకు ఇంకో కవిత తడుతుంది. ఆక్షణం లో నేను మరో శ్రీశ్రీ అనట్టు గా ఫీలైపోవడమూ జరుగుతూ ఉంటుంది. సరే ఇంతకీ ఆ శ్రీశ్రీ వ్యంగ్య పద్యం ఇదిగో:
"అరె యార్, ఇధర్ ఆవో దేఖో!
ఆంధ్రుల దిన పత్రిక
పెట్టుబడికీ కట్టుకథకీ
పుట్టిన విష పుత్రిక"
సుజనరంజని ఫిబ్రవరి సంపుటి లో అద్దేపల్లి గారు రాసిన వ్యాసం లో మూడో పేజీ లోంచి తీసుకున్నా:
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani.html
No comments:
Post a Comment